epaper
Thursday, March 26, 2026
epaper

ప్రజా సమస్యలపై ఉద్యమించాలి

ప్రజా సమస్యలపై ఉద్యమించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలతో దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఐక్య ఉద్యమాలతో వాటిని ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆదివారం మానకొండూరు మండల కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవనంలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. రైతు, విత్తన, విద్యుత్ చట్టాలు బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం కార్మిక వర్గానికి నష్టమన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కోతపెట్టి నిర్వీర్యం చేస్తున్నారని, కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపిందన్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, వ్యవసాయ కూలీలకు పని దినాలు పెంచి కనీస వేతనం రూ.600 చేయాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కుల, మత విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శవాన్ని తీసుకెళ్లాలంటే

శవాన్ని తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ను తోయాల్సిందే! ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి స్టార్ట్ కాక మొరాయించిన వాహనం…...

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి నేర సమీక్షలో సీపీ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ :...

వైద్యం పేరుతో దోపిడీ

వైద్యం పేరుతో దోపిడీ పెద్ద ఆస్ప‌త్రుల‌తో గ్రామీణ వైద్యుల లింకు చిన్న వైద్యానికి పెద్ద...

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..! క‌రీంన‌గ‌ర్‌ కలెక్టర్‌కు మొలంగూర్ వాసుల‌ వినతి గ్రామానికి రావాల్సిందిగ...

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img