పేదలకు అండగా సీఎం సహాయనిధి
ఆర్థిక సహాయం అవసరంలో ఆదుకుంటోంది
టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి
కాకతీయ, నెక్కొండ: అవసరమైన సమయంలో ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం పేదలకు పెద్ద ఊరటగా నిలుస్తుందని టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని మైనారిటీ వర్గానికి చెందిన సయ్యద్ అజిముల్లాకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17,500 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమని అన్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వం అందించే సాయం ప్రజలకు నమ్మకం కల్పిస్తుందని తెలిపారు. సయ్యద్ అజిముల్లా మాట్లాడుతూ, తనకు సహాయం అందించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, కుసుమ చెన్నకేశవులు, కేవీ సుబ్బారెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, చల్లా రఘోత్తం రెడ్డి, రావుల మహిపాల్ రెడ్డి, మహ్మద్ ఖలీల్, షేక్ షబ్బీర్, మహ్మద్ అన్వర్, కొనిజెటి బిక్షపతి, మహ్మద్ అమీర్, జవ్వాజీ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.


