కాలనీల అభివృద్ధే లక్ష్యం
నాణ్యతతో పనులు పూర్తి చేయాలి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
రూ.40 లక్షల సీసీ రోడ్లకు శంకుస్థాపన
కాకతీయ,నెక్కొండ : కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ పనులు చేపడుతున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని నందమూరి నగర్, రాజీవ్ నగర్ ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, కాలనీల్లో రవాణా సౌకర్యం మెరుగుపడాలని అన్నారు. పారిశుధ్య సమస్యలు తగ్గించేందుకు సీసీ రోడ్లు, కాలువలు అవసరమని తెలిపారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, ఉపసర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఇదునూరి సాయికృష్ణ, కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోలిశెట్టి బాను, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి, మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్, మహ్మద్ అన్వర్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


