ఆగి ఉన్న లారిని ఢీ కొట్టిన కారు
ఒక్కరు మృతి ఇద్దరికి తీవ్రగాయలు
ఆత్మకూరు సీఐ సంతోష్
కాకతీయ, ఆత్మకూరు : అగిఉన్న లారిని వెనుక నుంచి ఢీ కొట్టిన కారు ఒకరు మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో జాతీయ రహదారి 163 పై ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుందని ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపారు. సీఐ సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాజిపేటకు చెందిన పర్రెపాటి రాకేష్, మరియు తన స్నేహితులతో కలిసి ఆదివారం తెల్లవారు 3 గంటల సమయన హనుమకొండ నుంచి ములుగు వెళ్లే క్రమంలో జాతీయ రహదారి 163 పై నిలిపి ఉన్న లారిని వెనుక నుండి బలంగా ఢీ కొట్టగా రాకేష్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందడని తెలిపారు.మిగతా ఇద్దరు వంశీ కృష్ణ,నాగ శ్రవణ్ లకు తీవ్ర గాయలు అయ్యాయని వారిని వరంగల్ ఎంజియం ఆసుపత్రికి తరలించడం జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ సంతోష్ తెలిపారు.


