సీఎం సహాయనిధి పేదలకు వరం
ఎమ్యేల్యే యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని, పేద కుటుంబాలు వైద్యకోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్యేల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్యేల్యే క్యాంపు కార్యాలయంలో అదివారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. మండలానికి చెందిన 31 మంది ఆపన్నులకు రూ. 9,74000 వేల రూపాయల సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, సర్పంచ్ తోటకూరి శ్రీనివాస్, నాయకులు బానోత్ సోమన్న నాయక్, వెంకన్న నాయక్, హరికృష్ణ,
చంద్రశేఖర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


