epaper
Friday, March 27, 2026
epaper

శిక్షణా కేంద్రానికి రాజమౌళి పేరును కేటాయిస్తం..

శిక్షణా కేంద్రానికి రాజమౌళి పేరును కేటాయిస్తం..

*పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ..

*ప్రతి గ్రామపంచాయతీ గ్రామసభలో రాజమౌళి చరిత్రను వినిపిస్తాం..

*తెలంగాణ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క

*రాజమౌళి ఇతరుల గుర్తింపు కోసం పని చేసిన వ్యక్తి కాదు..

*గ్రామ అభివృద్ధి దేయంగా పనిచేసిన వ్యక్తి రాజమౌళి

*పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..

కాకతీయ, గీసుగొండ: తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరును కేటాయిస్తామని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో మంత్రి ఈ ప్రకటన చేశారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ రాజమౌళి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని,వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా సమాజం కోసం పని చేసిన నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. గ్రామస్తులను ఐక్యంగా చేసుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేసి అభివృద్ధిని సాధించిన తీరు ఆదర్శప్రాయమని తెలిపారు.గంగాదేవిపల్లి గ్రామ అభివృద్ధికి కూసం రాజమౌళి చేసిన కృషి రాష్ట్రంలోనే అన్ని గ్రామ పంచాయతీల గ్రామసభల్లో వినిపించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామంలోని తెలంగాణ గ్రామీణ శిక్షణ కేంద్రానికి రాజమౌళి పేరును ఖచ్చితంగా కేటాయిస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాజమౌళి తక్కువ చదువుకు న్నప్పటికీ సామాజిక స్పృహతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన నాయకుడని తెలిపారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను 90 దేశాల ప్రతినిధులు అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామస్తులు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జడ్పీ సీఈఓ రాంరెడ్డి,తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్,ఎంపీఓ పాక శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కూసం స్వరూప, బాలవికాస ప్రతినిధి శౌరెడ్డి, రాజమౌళి కుమారులు రమేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు దాతల ఆధ్వర్యంలో...

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల...

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య...

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర...

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి.. కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు వేగం ప్రాణాలకు ముప్పు : నెక్కొండ సీఐ...

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి బాధితుల‌కు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి వరంగల్ పోలీస్ కమిషనర్...

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img