మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సర్పంచ్ కళావతి
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలం లోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధి లోని మంగలి తండా కు చెందిన తేజ లచ్చిరాం నాయక్ ఇటీవల మృతిచెందగా శనివారం గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ బద్రునాయక్, వార్డు మెంబర్స్ అశోక్, హారిక, నిర్మల వీరన్న సావిత్రలతో కలిసి కుటుంబ సభ్యులను భార్య జ్యోతి, తండ్రి బాలు నాయక్ లను పరామర్శించి 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పార్టీ నాయకులు లాలూ నాయక్, ఎల్ వెంకన్న, ఎన్ శ్రీను నాయక్, తేజాతు వెంకన్న, పరమేష్, గణేష్, రవి, సురేష్, బాలు, కర్ణ కంటి వెంకట్ రెడ్డి, ముత్యాల లచ్చయ్య, బాణాల వెంకన్న, సంజీవ, గుర్రం యాకన్న, గాడి పెళ్లి రమేష్, బాణాల యాకన్న, బద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


