వెంకన్నకు పూర్వ కలెక్టర్ నుంచి సహాయం
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం పరిధిలోని శ్రీనివాస గుట్ట వద్ద వృక్షారోపణకు విశేషంగా కృషి చేస్తున్న పిట్టల వెంకన్న కి, పూర్వ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ బదిలీపై వెళ్లే సందర్భంలో తమ సొంత నిధుల నుంచి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించగా, ఆ మొత్తాన్ని పిట్టల వెంకన్న కి అందజేశారు. పాండురంగపురం గ్రామానికి చెందిన పిట్టల వెంకన్న పాల్వంచలోని శ్రీనివాస గుట్టపై భక్తులకు సేవగా అనేక వృక్షాలను నాటి సంరక్షిస్తున్నారు. గుట్టకు వచ్చే భక్తులకు మొక్కలు అందించేందుకు నర్సరీ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. ఈ నర్సరీ ఏర్పాటుకు అవసరమైన మొక్కల కొనుగోలు, పెంపకం, తోటపని పరికరాలు కొమ్మల ద్వారా పెంచే మొక్కలు కోసం ప్రోత్సాహకంగా ఈ సహాయం అందించబడింది. ఈ సందర్భంగా భక్త సమాజ మండలి అధ్యక్షులు ఊకె భద్రయ్య ఆరుట్ల లక్ష్మణాచారి సేవా ట్రస్టు సెక్రటరీ భక్త సమాజ మండలి సహాయ కోశాధికారి ధనకోటి వెంకటేష్ ఆ మొత్తాన్ని పిట్టల వెంకన్న కి అందజేశారు.ఈ సహాయంతో శ్రీనివాస గుట్ట వద్ద నర్సరీ ఏర్పాటు చేసి భక్తులకు మొక్కలు అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.


