గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు పంపిణీ
ప్రతి పాడి రైతు పశువుల ప్రాణాలను కాపాడుకోవాలి
సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్
కాకతీయ,రాయపర్తి : మండలంలోని బంధనపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ గోపాలమిత్ర ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేసారు.శనివారం గ్రామ సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రతి పాడి రైతు వినియోగించుకుని,తమ పశువుల ప్రాణాలను ఆరోగ్యంగా కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.పశువులకు సోకే ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని నివారించడానికి ముందస్తుగా టీకాలు వేయించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందే టీకాలు వేయించడం ఉత్తమమని, దీనివల్ల పాల దిగుబడి తగ్గకుండా పశువులు ఆరోగ్యంగా ఉంటాయని గోపాలమిత్ర చివ్వాలా రమేష్ పాడి రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద అశోక్,వార్డు సభ్యులు,కొండాపురం జెవిఓ లక్ష్మారెడ్డి, ఓఎస్ బాద్యా,పశువైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.


