అంజన్నను దర్శించిన బండి సంజయ్
కాకతీయ కరీంనగర్/కొండగట్టు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం మధ్యాహ్నం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లతో కలిసి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
మంత్రి రాకను పురస్కరించుకుని ఆలయ అధికారులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, గర్భగుడిలోకి ప్రవేశించి శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పూజారులు మంత్రికి శాలువా కప్పి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


