శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, జమ్మికుంట/ఇల్లంతకుంట : అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌కు అందజేశారు. అనంతరం మంత్రులను శాలువాలతో సన్మానించి, దేవస్థానం తరఫున మెమెంటోలను ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు అందించారు.
శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరుకావాలని కరీంనగర్ ఇన్‌చార్జి మంత్రి సహా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్, ధర్మకర్తలు పరమేష్, నారాయణరెడ్డి, రాజేందర్, మల్లేష్, రామ్ రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.


