కేశవపట్నంలో ఘనంగా రంజాన్ వేడుకలు
కాకతీయ,శంకరపట్నం: మండలంలో పవిత్ర రంజాన్ పండుగను కేశవపట్నం గ్రామంలో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జామా మసీదు కమిటీ అధ్యక్షులు ఖాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో కేశవపట్నం గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సాయం అందించారు. మహిళలకు చీరలు, పురుషులకు నగదు రూపంలో ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా పరస్పర సహకారం, సేవా భావం చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.


