epaper
Thursday, March 26, 2026
epaper

విద్యా రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

విద్యా రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
బడ్జెట్‌లో విద్యకు మొండి చేయి
అరకోర నిధులపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం
బడ్జెట్ ప్రతులు ద‌హ‌నం

కాకతీయ ,కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.22 శాతం మాత్రమే కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ హామీని నిలబెట్టుకోలేక పోయిందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్‌షిప్స్ ఉండగా, వాటి పరిష్కారానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని పేర్కొన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలకు భారీ నిధులు కేటాయిస్తూ, మిగతా విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు.అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూరిబా పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు వంటి కీలక విద్యాసంస్థలకు తగిన నిధులు లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం కాకుండా, విద్యా రంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు.విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, నాయకులు కళ్యాణ్, మహేష్, నవీన్, ప్రణయ్, దిలీప్, రాజు, సందీప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన సెల్వరాజును రక్షించిన పోలీసులు వాకింగ్‌కు వెళ్లిన మాజీ సర్పంచ్...

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం విద్యారంగ సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులా? ప్రజాపాలనలో...

శభాష్ సుష్మ

శభాష్ సుష్మ పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో బంగారు ప‌త‌కాలు సాధించిన కానిస్టేబుల్ కాకతీయ ,కొత్తగూడెం :...

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి...

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం...

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు యాంత్రీకరణ, అనుబంధ...

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img