నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ఐదుగురుపై కేసు నమోదు
ఎస్సై చిర్ర రమేష్ బాబు
కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి,. మునిగలవీడు గ్రామాల శివారులో ఉన్న ఆకేరు వాగు నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసి, 5 గురు వ్యక్తులు వంగూరి వెంకటేష్, ధర్మారపు ఉమేష్ ,నిదానపల్లె ప్రవీణ్, పెరుమాండ్ల ప్రదీప్, ఇస్సాంపెల్లి వెంకటేష్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ ఇసుక కోసం వెళ్తున్న ఎటువంటి కూపన్లు లేని ఖాళీ ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని కాళీ ట్రాక్టర్లను ఆర్టీవో ఆకు రాయడం జరిగిందని , బ్రాహ్మణ కొత్తపల్లి ఆకేరు వాగులో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా ట్రేoచ్ కందకం తీపించామని ఎస్సై అన్నారు.


