epaper
Thursday, March 26, 2026
epaper

మొండి చేయి!

మొండి చేయి!
బ‌డ్జెట్‌లో జిల్లాకు ద‌క్క‌ని ప్రాధాన్యం
ప్ర‌త్యేక కేటాయింపుల ఊసే లేదు
4 జిల్లాలకు ఒక్క మెగా ప్రాజెక్టు లేదు
కాగితాల‌కే ప్ర‌తిపాద‌న‌లు,ప్ర‌ణాళిక‌లు ప‌రిమితం
సాధారణ కేటాయింపుల‌తోనే స‌ర్దుబాటు
ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాలకు కనిపించని ప్రాధాన్యం
సమస్యలు యథాతథం.. ప్రణాళికలు కనిపించని పరిస్థితి
పరిశ్రమలు, ఐటీ అవకాశాలు లేక యువతలో నిరాశ

కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2026–27 భారీ సంఖ్యలతో ఆకట్టుకున్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై స్పష్టమైన ప్రాధాన్యం కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రూ. 3,24,234 కోట్ల వ్యయం, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు ప్రకటించింది. వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ వంటి రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు నేరుగా ఉపయోగపడే ఒక్క మెగా ప్రాజెక్టు కూడా లేకపోవడం అసంతృప్తిని పెంచుతోంది. సాగునీటి విస్తరణ, కాలువల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ కేంద్రాల అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాల్లో ఈ 4 జిల్లాలకు ప్రత్యేక ప్రణాళికలు కనిపించలేదు. బడ్జెట్‌లో ఉన్న పెద్ద సంఖ్యల మధ్య ఈ ప్రాంతాలు సాధారణ కేటాయింపుల్లో కలిసిపోయినట్టుగా మారాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు మంత్రులు ఉన్నా ప్రయోజనం కనిపించలేదు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దుద్దిళ్ల శ్రీదర్ బాబు, పోన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాకు తగిన స్థాయిలో ప్రయోజనం తీసుకురాలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నిధులు కేటాయించినప్పటికీ సిరిసిల్ల చేనేత కార్మికులు, జగిత్యాల–పెద్దపల్లి రైతులు, బీసీ వృత్తిదారులు, గిరిజన తండాల సమస్యలకు ప్రత్యేక చర్యలు కనిపించలేదు. పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అవకాశాలు లేకపోవడం యువతలో నిరాశను మరింత పెంచుతోంది. పెద్దపల్లిలో పరిశ్రమల విస్తరణ, జగిత్యాలలో సాగునీటి సమస్యలు, రాజన్న సిరిసిల్లలో చేనేత సంక్షోభం, కరీంనగర్ నగరాభివృద్ధి వంటి అంశాలు బడ్జెట్‌లో ఎక్కడా ప్రతిబింబించలేదు. చేనేతకు నిధులు ఉన్నప్పటికీ సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజీ లేదు. వ్యవసాయానికి కేటాయింపులు ఉన్నప్పటికీ జగిత్యాల రైతులకు లక్ష్యిత ప్రణాళికలు కనిపించలేదు. పట్టణాభివృద్ధి నిధులు ఉన్నప్పటికీ కరీంనగర్‌కు స్పష్టమైన దిశ చూపలేదు.

పథకాలు ఉన్నా.. ప్రత్యక్ష లాభం లేదు

రైతు భరోసా రూ. 18,000 కోట్లు, చేయూత రూ. 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లు రూ. 5,500 కోట్లు, విద్యుత్ సబ్సిడీ రూ. 14,000 కోట్లు, స్కాలర్‌షిప్‌లు రూ. 4,343 కోట్లు వంటి పథకాల ద్వారా పరోక్ష ప్రయోజనం ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ ఇవి రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే సాధారణ పథకాలే గానీ ఈ జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేకపోతున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతం బడ్జెట్‌లో స్పష్టమైన ప్రాధాన్యం లేకుండా మిగిలిపోయిందనే విమర్శలు బలపడుతున్నాయి. భారీ సంఖ్యలతో ఉన్న బడ్జెట్‌లో లక్ష్యిత ప్రణాళికలు లేకపోవడం ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాకు తగిన స్థాయిలో నిధులు రాకపోవడం రాబోయే రోజుల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శవాన్ని తీసుకెళ్లాలంటే

శవాన్ని తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ను తోయాల్సిందే! ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి స్టార్ట్ కాక మొరాయించిన వాహనం…...

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి నేర సమీక్షలో సీపీ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ :...

వైద్యం పేరుతో దోపిడీ

వైద్యం పేరుతో దోపిడీ పెద్ద ఆస్ప‌త్రుల‌తో గ్రామీణ వైద్యుల లింకు చిన్న వైద్యానికి పెద్ద...

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..! క‌రీంన‌గ‌ర్‌ కలెక్టర్‌కు మొలంగూర్ వాసుల‌ వినతి గ్రామానికి రావాల్సిందిగ...

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img