పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖ చేసిన ఎస్పీ
కాకతీయ, మహబూబాబాద్: విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ సూచించారు. అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి రాజీ ఉండదని, తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నగూడూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఎస్సై ప్రవీణ్ మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. గ్రామాల్లో భద్రత పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని సర్పంచ్‌లతో చర్చించారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు.


