కరీంనగర్‌లో కోతుల బెడదకు చెక్ 109 కోతుల పట్టివేత
కాకతీయ, కరీంనగర్/ కార్పొరేషన్ : ప్రజల నుంచి అందిన వినతులు, అభ్యర్థనల మేరకు నగరంలో పెరిగిన కోతుల బెడద నివారణకు మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. కార్పొరేషన్ పరిధిలోని వార్డు నం. 9లో ఉజ్వల పార్క్, ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు.
ఏజెన్సీ సిబ్బంది సహాయంతో మొత్తం 109 కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
వెటర్నరీ ఆఫీసర్ డా. వై. దుర్గా ప్రసాద్ రెడ్డి తెలిపారు.


