ఘనంగా ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు
కాకతీయ, జమ్మికుంట: తన జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజల ఆదరణే తనకు బలమని పేర్కొన్నారు. షామీర్పేట నివాసంలో జరిగిన వేడుకల్లో ఒగ్గుడోలు, కోయ నృత్యాలు, డప్పు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేలాది మంది అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విలాసాగర్ సర్పంచ్ గరిగంటి శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జమ్మికుంట మాజీ సర్పంచ్ సురేందర్ రాజు, ఆరెల్లి భాస్కర్, గరిగంటి లింగమూర్తి, వెంకటేష్, రమేష్, అశోక్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


