కాకతీయ, బయ్యారం,(గార్ల) : రాహుల్ గాంధీ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కాంగ్రెస్ కార్యర్తలు, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశ ప్రధాని మోదీ, ఆయన తల్లిని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ మహిళా మోర్చ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళు తున్నారని సమాచారం అందుకున్న గార్ల పోలీసులు ఆదివారం ఉదయమే మహిళా మోర్చా నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అరెస్టు చేసిన వారిలో మహబూబాబాద్ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు గుండె బోయిన నాగమణి, గార్ల మండల మహిళ మోర్చ అధ్యక్షురాలు ఆజ్మీర సుమలత, నాయకులను జంపాల శ్రీను, పూనెం రాంబాబు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


