రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..!
కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పడమటి వాడ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం అధ్యక్షుడిగా కేసిరెడ్డి నర్సారెడ్డి , ఉపాధ్యక్షుడిగా బద్దం రవీందర్, కోశాధికారిగా సామ మోహన్ రెడ్డి, కార్యదర్శిగా గంగం మహేష్ రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారిని సంఘ సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని, యువత ఐక్యంగా పని చేస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.


