ఝల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు
కాకతీయ, చెన్నారావుపేట : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిర్వహించడం ముఖ్యమని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బాధావత్ బాలు నాయక్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చెన్నారావుపేట మండలం ఝల్లి గ్రామ మజీద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఘనంగా దావత్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసానికి మాత్రమే కాకుండా సేవాభావం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ముస్లిం కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి మజీద్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోరగా, ప్రభుత్వం దాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు తోఫా కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ లౌకికవాదాన్ని బలపరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.


