రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు
వేములవాడ దేవస్థానానికి విశిష్ట గౌరవం
సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళాకారుడు శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : ఉగాది పురస్కారాలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి విశిష్ట గౌరవం లభించిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారి సురేష్, నాదస్వర కళాకారుడు ఎన్ శ్రీనివాస్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పురస్కారాలను అందుకున్న దేవస్థానం సిబ్బందిని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల్ రమాదేవి అభినందించారు. ఈ పురస్కారాలతో దేవస్థానం ప్రతిష్ఠ మరింత పెరిగిందని భక్తులు, అధికారులు అభిప్రాయపడ్డారు.


