ఆర్కేపీలో ఉగాది వేడుకలు ఘనంగా
కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణంలో ఉగాది పర్వదిన వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సంప్రదాయాల పద్ధతిలో ఉగాది పచ్చడి,బెల్లం బచ్చలు పండుగకు ప్రత్యేకంగా ఉంటాయి. స్థానిక ఆర్కే 3 దుర్గామాత ఆలయం వద్ద శాకాంబరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు. కాగా సాయంత్రం భక్తులు ఆలయాలకు చేరుకొని వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం తిలకించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివిధ రాశుల ఆదాయ,వ్యయాలను అర్చకులు భక్తులకు వివరిస్తారు.


