epaper
Thursday, March 19, 2026
epaper

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌
కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం లోపించింది
ఐదురాష్ట్రాల ఎన్నిక‌లు సైతం రేవంత్ రెడ్డికే అప్ప‌గించింది
సీఎం వార్నింగ్ ఆ పార్టీలోని సీనియ‌ర్ల‌కే
ఆశీర్వాదం పొందాల్సింది పోయి.. “తొక్కుకుంటూ వ‌స్తాన‌న‌డం దారుణం
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం
రైతుభ‌రోసాలో మిగ‌తా రూ.41 వేల కోట్లు ఎక్కడ..?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వ‌జం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాజకీయాల్లో ప్రజల ఆశీర్వాదం ప్రస్తావించాల్సింది పోయి “తొక్కుకుంటూ సీఎం అయ్యా” వంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేతలకే పరోక్ష వార్నింగ్‌గా ఉన్నాయని ఆయన ఆరోపించారు. పార్టీలో అసమ్మతి స్వరాలను అణచివేయడానికే ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ నాయకత్వంపై అసహ్యం పెరుగుతోందని అన్నారు. రాహుల్ గాంధీ పూర్తిగా రేవంత్ రెడ్డిపైనే ఆధారపడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారని పేర్కొన్నారు. సర్వేలు నుంచి నిధుల సమీకరణ వరకు అన్నీ ఒకే వ్యక్తి చేతుల్లో ఉండటం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపిస్తూ 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ ప్రశ్నించకపోవడం, అవినీతి అంశాల్లో కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడం దీనికే నిదర్శనమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మహాశక్తి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉగాది పచ్చడి సేవిస్తూ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరాభవ’ నామ సంవత్సరం అహంకారాన్ని జయించి విజయానికి దారి తీస్తుందని అన్నారు. అయితే ఇదే వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను మరింత ఘాటుగా కొనసాగించారు. అసెంబ్లీలో వందేమాతరం గేయాన్ని మజ్లిస్ ఎమ్మెల్యేలు బహిష్కరించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్, సీఎం, స్పీకర్ సమక్షంలో జాతీయ గేయాన్ని అవమానించినా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మౌనం తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ అధికారంలో ఉంటే ఇలాంటి ఘటనలకు కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని హెచ్చరించారు.

రూ.41 వేల కోట్లు ఎక్కడ..?

రైతు భరోసా అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. చెల్లించాల్సిన రూ.58,500 కోట్లలో కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే జమ చేసి ఇంకా రూ.41 వేల కోట్లు బాకీగా ఉంచిందన్నారు. రైతులకు సుమారు రూ.30 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.36 వేలు బాకీగా ఉందని వెల్లడించారు. మూడు విడతల సొమ్మును ఎగ్గొట్టారని ఆరోపిస్తూ వెంటనే బకాయిలన్నీ రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, కూలీలు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ‘కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు నేరుగా నిధులు జమ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమేనని అయితే బాధితులకు అన్ని హామీలు అమలు చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పేదల ఇండ్లను కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలుస్తామని హెచ్చరించారు.

హోంశాఖ ప్రాధాన్యం తెలియదా?

కరీంనగర్ ఎంపీకి ప్రాధాన్యతలేని శాఖ ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తిప్పికొట్టారు. హోంశాఖ అత్యంత కీలకమైందని, రాష్ట్రంలోనే సీఎం దగ్గరే ఉండేంత ప్రాధాన్యం ఉన్న శాఖనని గుర్తుచేశారు. కేంద్రంలో కూడా అదే స్థాయిలో కీలక బాధ్యతలను ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా తనకు అప్పగించారని తెలిపారు. బీసీని ప్రధాని చేయడం నుంచి 27 మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 7 మంది ఎస్టీలకు మంత్రి పదవులు ఇవ్వడం, ఎస్టీ ఆదివాసీ మహిళను, మైనారిటీ వర్గానికి రాష్ట్రపతి పదవి ఇవ్వడం బీజేపీ సామాజిక న్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక రవాణాపై దాడులు

ఇసుక రవాణాపై దాడులు సీఐ నిరంజన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ రూరల్: అక్రమ ఇసుక...

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు వేములవాడ దేవస్థానానికి విశిష్ట గౌరవం సీఎం చేతుల మీదుగా అవార్డు...

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్ 58 మంది సభ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు టీపీసీసీ...

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం : మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ,...

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం పరాభవ నామ సంవత్సర విశిష్టత వివరణ వేద పండితులు...

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు రూ.60 వేల విలువైన కరెంటు వైర్లు స్వాధీనం సీఐ...

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ :...

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ కాకతీయ,శంకరపట్నం:మండలంలో చల్లూరు గ్రామానికి చెందిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img