31న ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ విడుదల
హారర్ థ్రిల్లర్‌గా రానున్న అనుష్క చిత్రం
కాకతీయ, సినిమా: టాలీవుడ్ నటి అనుష్క శెట్టి తదుపరి సినిమా ‘కథానార్’పై తాజా అప్‌డేట్ వచ్చింది. గతంలో వచ్చిన చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు ఆమె కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘కథానార్’పై విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ గ్లింప్స్‌ను మార్చి ముప్పై ఒకటిన మధ్యాహ్నం ఒక గంట ముప్పై ఒక నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టర్‌ను పరిశీలిస్తే హారర్ ఎలిమెంట్స్‌ను బలంగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జయసూర్య, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే.


