కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీసీ బిల్లులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేశారు.
ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. తెలంగాణ మొదటి స్పీకర్ గా బలహీనవర్గాల బిడ్డ మధుసూదనాచారిని, శాసనమండలి తొలి చైర్మన్ గా స్వామిగౌడ్ ను నియమించాం. అడ్వకేట్ జనరల్ గానూ బలహీన వర్గానికి చెందిన బీఎస్ ప్రసాద్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించంది. కె.కేశవరావు, డి.శ్రీనివాస్ , బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్, వద్దరాజు రవిచంద్రనురాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.


