విధుల్లో నిర్లక్ష్యం తగదు
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పట్టణంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు. పారిశుధ్య కార్మికుల పని వేళల్లో ఏమైనా సమస్యల ఉన్నాయా ? అని తెలుసుకున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వార్డులో ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తిస్తూ, పనిభారం ఎక్కువగా ఉన్న సమయంలో టీం వర్క్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అలాగే శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నవారిలో ఎవరైనా ఉన్నత చదువులు చదువుకున్నట్లయితే వారిని గుర్తించి వారి పై చదువుకు తగిన విధంగా సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ని, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ, స్థానిక కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, చందా రాజు, చింతల శ్రీనివాస్, అజయ్ రావు, దిడ్డి రాము, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


