epaper
Wednesday, March 25, 2026
epaper

బాధితుల వద్దకే పోలీస్ సేవలు

బాధితుల వద్దకే పోలీస్ సేవలు

ఆన్‌లైన్ ఎఫ్ఐఆర్‌తో వేగవంతమైన న్యాయం

జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేష‌న్ల‌లో అమ‌లు

ఇప్పటి వరకు 12 కేసులు నమోదు

ఎస్పీ మహేష్ బి. గితే

కాకతీయ, సిరిసిల్ల టౌన్: ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసింది. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపిన ప్రకారం, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు “ఆన్సైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ విధానంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సంఘటనా స్థలంలోనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసే సదుపాయం కల్పించారు.
నేరం జరిగిన తరువాత శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం భారంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానం అమలులో ఉండగా, ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వద్ద నుంచే ఫిర్యాదును స్వీకరిస్తారు. డయల్ 100కు కాల్ చేసినా లేదా నేరుగా సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందించి, ట్యాబ్‌ల సహాయంతో ఆన్లైన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలు వంటి ఘటనల్లో గాయపడిన వారికి వెంటనే వైద్యసాయం అందించి ఆసుపత్రులకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యాభర్తల వివాదాలు, వేధింపులు, అనుమానాస్పద మృతులు వంటి కేసులను సంఘటనా స్థలంలోనే తక్షణం నమోదు చేసే అవకాశం లభిస్తోంది. ఈ విధానం వల్ల బాధితులకు త్వరిత న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్

గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కలెక్టర్ చిత్రా మిశ్రా కాకతీయ,...

ధాన్యం నిల్వకు గోదాములు సిద్ధం చేయాలి

ధాన్యం నిల్వకు గోదాములు సిద్ధం చేయాలి కొనుగోలు సీజన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి పెద్ద‌ప‌ల్లి...

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఎన్సీసీ శిబిరం

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఎన్సీసీ శిబిరం కాకతీయ, కరీంనగర్ /కొత్తపల్లి : విద్యార్థుల్లో...

మృతుడి కుటుంబానికి సీఐటీయూ సాయం

మృతుడి కుటుంబానికి సీఐటీయూ సాయం కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇటీవల...

తాడికల్‌లో “ప్రజా బాట” కార్యక్రమం

తాడికల్‌లో “ప్రజా బాట” కార్యక్రమం రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కాకతీయ,శంకరపట్నం :...

త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..!

త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..! క‌రీంన‌గ‌ర్‌లో య‌థేచ్ఛ‌గా డొమెస్టిక్ దందా వ్యాపారాల‌కు మ‌ళ్లుతున్న గృహ గ్యాస్...

రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం లోక్ అదాలత్‌తో వేగవంతమైన న్యాయం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కాకతీయ,...

గూగుల్ పేలో లంచం..

గూగుల్ పేలో లంచం.. ఏసీబీకి చిక్కిన  సిద్ధిపేట త్రీ టౌన్ ఎస్ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img