జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి
* దాతల సహాయం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపు
* జన్యుపరమైన వ్యాధితో ఒకే ఇంట్లో తండ్రి కుమారుడు మృతి
* అదే వ్యాధితో బాధపడుతున్న కూతురు
కాకతీయ,చేర్యాల : మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన కోతి రమ్య (25) తండ్రి కోతి ఆనందం జన్యుపరమైన వ్యాధితో మరణించారు. అనంతరం ఆనందం కుమారుడు రాజు (26) అదే వ్యాధితో
కన్నుమూశారు. ఇంత చిన్న వయస్సులోనే తండ్రి, అన్నను కోల్పోయిన రమ్య జీవితంలో ఎంతో బాధను చూసింది. అయినా కూడా ఆమె చిన్నప్పటి నుంచి చదువులో, ఆటలలో చురుకుగా ఉండే రమ్యకు కూడా న్యూమోనియా వ్యాధి వచ్చింది ఈ కారణంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం మధ్యలోనే తన చదువును ఆపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు రమ్య కూడా అదే జన్యుపరమైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. కుటుంబానికి పెద్ద దిక్క లేక దిన దయ స్థితిలో కొట్టుమిట్టడుతున్నారు, రమ్య తల్లి శ్యామల ఎంతో బాధతో తన కూతురిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగ లేకపోవడంతో హాస్పిటల్కు తీసుకెళ్లడం చాలా కష్టంగా మారింది. తల్లి తన కూతురిని కాపాడుకోవడానికి ప్రభుత్వ సహాయం, తోటి మనసున్న వ్యక్తుల సహాయం కోసం ఎదురుచూస్తోంది. దాతలు సహాయం చేసి నిండు ప్రాణాన్ని కాపాడలని రమ్య తల్లి వేడుకుంటోంది. ఆర్థిక సహాయం చేసే వారు రమ్య తల్లి శ్యామల ఫోన్ నవంబర్ 8106779672 కు సంప్రదించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.


