పిహెచ్ డి పట్టా అందుకున్న ఉపాధ్యాయురాలు
* ఓయూ కెమిస్ట్రీ విభాగంలో సరిత కు డాక్టరేట్
* 2023 లో భర్త, 2026లో భార్యకు డాక్టరేట్
* హర్షం వెలిబుచ్చిన గ్రామస్తులు
కాకతీయ,చేర్యాల: ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్య ఉపాధ్యాయురాలు కొరటికంటి సరిత డాక్టరేట్ సాధించారు. ప్రొపెసర్ కె.భాస్కర్ పర్యవేక్షణలో “డిజైన్, సింథసిస్, క్యారెక్టరైజేషన్, మాలిక్లర్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ న్యూ నైట్రోజన్ బేస్డ్ అజోల్ డెరివేటివ్స్ ఆస్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్” అనే అంశంపై పరిశోధన చేయగా ఉస్మానియా విశ్వావిద్యాలయం సైన్స్ కళాశాల పరిధిలో కెమిస్ట్రీ విభాగంలో పరిశోదన చేయగా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు సరిత కు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేసినట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వారు. ఆమె పీహెచ్డీ సాధించడం పట్ల పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు. కెమిస్ట్రీ విభాగంలో భార్య పి.హెచ్.డి పట్టా సాధిస్తే భర్త బందారం వెంకటేష్ గౌడ్ అదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2023 సంవత్సరంలో తత్వ శాస్రం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. భార్య భర్తలు ఇద్దరు డాక్టరేట్ అవార్డు పొందడంతో గ్రామానికి గర్వకారణమని రాంపూర్ గ్రామస్థులు హర్షం వెలిబుచ్చారు.వీరిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని విజయ తీరాలకు చేరాలన్నారు. అనంతరం డాక్టరేట్ సాదించిన భార్య భర్తలు సరిత -వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టపడుతూ చదువును ఇష్టపడుతూ అనుకున్న గమ్యాన్ని సాదించామన్నారు.


