epaper
Thursday, March 19, 2026
epaper

బీనామీతోతో మామూళ్ల‌ దందా

బీనామీతోతో మామూళ్ల‌ దందా

ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ వసూళ్లు
యూపీఐ లావాదేవీలతో డబ్బుల మళ్లింపు
ఏసీబీ సోదాల్లో రూ.20 లక్షలు స్వాధీనం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : అవినీతిని అరికట్టాల్సిన అధికారే తన అధికారం ఉపయోగించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటన ఏసీబీ దాడుల్లో బయటపడింది. కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము తనకు పరిచయమైన టీచర్ జక్కాని వేణును బీనామీగా పెట్టుకుని మామూల్ల దందా నడిపిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 17, 2026 రాత్రి సుమారు 8.25 గంటలకు ఈ ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో ఎస్‌హెచ్ఓగా పనిచేసిన కాలంలోనే ఒక బెల్లం వ్యాపారి నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేస్తూ అక్రమ సంపాదన సాగించినట్లు దర్యాప్తులో తేలింది. నేరుగా డబ్బులు తీసుకోకుండా మధ్యవర్తిగా టీచర్‌ను ఉపయోగిస్తూ 2022 నుంచి 2024 వరకు యూపీఐ లావాదేవీల ద్వారా భారీగా డబ్బులు సేకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమ వ్యవహారంలో జక్కాని వేణు తన ఎస్బీఐ, యూబీఐ బ్యాంకు ఖాతాలను వినియోగించి డబ్బులను స్వీకరించి వాటిని గుండేటి రాము అతని తండ్రి ఖాతాలకు బదిలీ చేస్తూ అసలు డబ్బు జాడను దాచిపెట్టే బెనామీ వ్యవస్థ నడిపినట్లు బయటపడింది. గుండేటి రాము నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో లేని రూ.20 లక్షల నగదు స్వాధీనం కావడం ఈ అవినీతి దందాకు ఘన ఆధారంగా మారింది. ఈ మొత్తం అక్రమంగా సంపాదించినదేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ జడ్జి (ఎస్‌పీఈ & ఏసీబీ కేసులు) ఎదుట హాజరుపర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతామ‌ని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక రవాణాపై దాడులు

ఇసుక రవాణాపై దాడులు సీఐ నిరంజన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ రూరల్: అక్రమ ఇసుక...

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు వేములవాడ దేవస్థానానికి విశిష్ట గౌరవం సీఎం చేతుల మీదుగా అవార్డు...

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్ 58 మంది సభ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు టీపీసీసీ...

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం లోపించింది ఐదురాష్ట్రాల ఎన్నిక‌లు సైతం రేవంత్...

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం : మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ,...

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం పరాభవ నామ సంవత్సర విశిష్టత వివరణ వేద పండితులు...

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు రూ.60 వేల విలువైన కరెంటు వైర్లు స్వాధీనం సీఐ...

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img