epaper
Saturday, March 14, 2026
epaper

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు
బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు
గ్యాస్ సరఫరాపై కలెక్టర్ సమీక్ష
పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, పౌర సరఫరాలు, రవాణా, విద్య, వైద్య శాఖల అధికారులతో గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల్లో గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే సంబంధిత అధికారులు ఆయా విద్యాసంస్థలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు.

ప్రత్యేక కమిటీతో పర్యవేక్షణ

రాష్ట్ర పౌరసరఫరాలు మరియు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా పౌరసరఫరాల అధికారి కన్వీనర్‌గా పన్నెండు మంది సభ్యులతో డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటయ్యిందన్నారు. ఈ కమిటీలో ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా రవాణా అధికారి, డీఈవో, జిల్లా సంక్షేమ అధికారులు, వ్యవసాయ అధికారి, జిల్లా వైద్యాధికారి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కమర్షియల్ వినియోగానికి ఉపయోగిస్తున్న పదకొండు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఒక ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఏడు ఒక సున్నా తొమ్మిది కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి షా ఫైజల్ హుస్సేనీ, జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు, వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్ దళిత యువతిని మోసం చేసిన కేసులో అరెస్టు పెళ్లి చేస్తానని...

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,...

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు టెన్త్ ప‌రీక్ష కేంద్రాల‌ను తనిఖీ చేసిన కలెక్టర్ మౌలిక...

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్...

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి:...

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img