ఎమ్మెల్యే పిఏ అరెస్ట్
దళిత యువతిని మోసం చేసిన కేసులో అరెస్టు
పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణ
ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు
కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారిన ఘటనలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిఏ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఏ శ్రీనివాస్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
బాధితురాలు దళిత యువతి కావడంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పిఏ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


