పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం
చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
కాకతీయ, నర్సంపేట: పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం అని నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అన్నారు. శనివారం పట్టణంలోని 20వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పట్టణ రూపు రేఖలను మారుస్తామన్నారు. వార్డు కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని & ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గంధం నరేందర్, స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణి, కౌన్సిలర్ లు ఎలుకంటి విజయ్, అయూబ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరి కృష్ణ, శివ, తదితరులు పాల్గొన్నారు.


