ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది
రావిరాల లో 10 లక్షల సిసి రోడ్లను ప్రారంభించిన
—- ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
కాకతీయ, నెల్లికుదురు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లతో పేదల వారి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మండలంలోని రావిరాల గ్రామంలో కడారి వెంకన్న సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడంతో గృహప్రవేశానికి పాల్గొని ఆయన మాట్లాడుతూ ఇందిర ఇండ్లతో పేదల కల సకారం అయిందని అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని పేద, బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రావిరాల గ్రామం అభివృద్ధిలో భాగంగా 15 లక్షల సిసి రోడ్లను మంజూరు చేసినట్లు ఆయన తెలుపుతూ వాటిని స్థానిక సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకన్న, ఉప సర్పంచ్ తరుణ్ లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఫ్రైడే డ్రై డే సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు పాటించాలని గ్రామంలో ఇరువైపులా మురికి నీరును నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చందా నరేష్, ఎంపీడీవో కుమార్, ఎం పి ఓ పద్మ, హౌసింగ్ ఏ ఈ అనిల్, ఎస్సై చిర్ర రమేష్ బాబు, గ్రామ కార్యదర్శి అరుణ, వివిధ గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


