ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం, గడ్డివానిపల్లి గ్రామంలో బుధవారం యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడని ,స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోయిని వెంకటేష్ (27 )ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు .కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చేసరికి తలుపులు మూసి ఉండడంతో స్థానికుల సాయంతో తెరిచి చూడగా వెంకటేష్ విగత జీవిగా కనిపించాడు .సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .మరణానికి గల కారణాలు తెలియాలి.


