epaper
Saturday, November 15, 2025
epaper

కార్య‌ద‌ర్శుల‌కు అప్పుల భారం

కార్య‌ద‌ర్శుల‌కు అప్పుల భారం
గ్రామాల్లో వ‌స‌తుల క‌ల్ప‌న‌కు తిప్ప‌లు
పంచాయ‌తీ ఉద్యోగుల‌పైనే జీపీల నిర్వ‌హ‌ణ భారం
పెట్రోల్ బంకుల్లో వేలల్లో ఖాతాలు
ట్రెజరీ నుండి నిధుల విడుదలకు జాప్యం
తీవ్ర ఒత్తిడిలో క్షేత్ర‌స్థాయి ఉద్యోగులు

కాకతీయ,గీసుగొండ : దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు అని నానుడి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, నిధుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిధుల లేమితో అభివృద్ధికి ఆటంకం క‌లుగుతోంది. గ్రామపంచాయతీలలో సర్పంచుల పాలన లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన నిధులు నిలిచిపోవడంతో గ్రామాలలో చేయవలసిన అభివృద్ధి పనులు కుంటుపడి, గ్రామాల అభివృద్ధి కుంటుపడింది.

కార్యదర్శుల అప్పుల తిప్ప‌లు..
గ్రామాలలో సర్పంచులు లేకపోవడంతో గ్రామ సంరక్షణ పంచాయతీ కార్యదర్శుల పైన ప‌డుతోంది. దీంతో గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలైన వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు,చెత్త సేకరణ, మంచినీటి సరఫరా వంటి పనులను నిర్వహించ డానికి కార్యదర్శులు సొంతంగా అప్పులు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పంచాయతీలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని జిల్లా ట్రెజరీ అకౌంట్లో జమ చేస్తారు. కానీ గ్రామ అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన డబ్బుల కోసం ట్రెజరీలో దరఖాస్తు చేసుకుంటే నిధుల విడుదలకు తీవ్ర జాప్యం జరుగుతుందని ఓ మండల స్థాయి అధికారి తెలిపారు. గతంలో వసూలు చేసిన పనులను గ్రామ బ్యాంకు ఖాతాలో జమ చేసి ఖర్చులకోసం నిధులను విడుదల చేసుకునే అవకాశం ఉండేదని ప్రభుత్వ కొత్త విధానంతో ఆ అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.

సొంతంగా అప్పులు చేసి పనులు కొనసాగిస్తున్నాం..
గీసుగొండ మండల కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు శంకర్ రావు

గ్రామాలలో సర్పంచులు లేకపోవడంతో గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడిందని, గ్రామ ప్రజల మౌలిక సదుపాయాల కోసం సుమారు మూడు లక్షల రూపాయలు సొంతంగా అప్పు చేసి ఖర్చు చేశానని గీసుగొండ మండల కార్యదర్శిల సంఘం అధ్యక్షుడు కొమ్మాల గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ నడిపించుటకు పెట్రోల్ బంకులో ఇప్పటికే 50,000 ఖాతా పెట్టగా ఖాతా కట్టకపోతే ట్రాక్టర్ల ఇకపై డీజిల్ పోసేది లేదని బంకు యాజమాన్యం అంటున్నారు. పై అధికారులకు చెప్పుకోలేక విధులు నిర్వహించలేక తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం పల్లెల్లో ఏర్పడిన ఈ సమస్యలను అధిగమించడానికి గ్రామ పంచాయతీలకు సమయానుకూలంగా నిధులు విడుదల కావడమే ఒక్కటే పరిష్కారం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే, అప్పుల్లో కూరుకుపోతున్న కార్యదర్శుల సమస్య మరింత తీవ్రమై, పల్లెల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img