కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం
*రూ.13,39,710/- హుండీ ఆదాయం
*వివిధ ఆర్థిక సేవల ద్వారా రూ 7,82,700/- ఆదాయం…
*జాతర విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు ఈఓ ప్రసాద్
కాకతీయ,గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ఈ సంవత్సరం 21,22,410/- రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ప్రసాద్ తెలిపారు. మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర ముగియడంతో బుధవారం దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులతో హుండీల లెక్కింపు నిర్వహించారు. జాతరకు వచ్చిన భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించగా ఆదాయము రూ.13,39,710/- రాగా, శీఘ్ర దర్శనం రూ.100/- టికెట్ ద్వారా 2,29,000/-, 50 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా 3,61,200/-, కేశఖండనం ద్వారా 72,500/-, అష్టోత్తరాలు ద్వారా 1,20,000/- రూపాయలు, మొత్తంగా రూ.21,22,410/-రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ప్రసాద్ తెలిపారు.జాతర ఉగాది వరకు కొనసాగనుండగా మరింత ఆదాయం సమ కోరుతుందని ఈఓ ఆశాభావం వ్యక్తం చేశారు. జాతర విజయవంతం కోసం సహకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు భక్తులకు ఈఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు,ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి రామాచార్యులు,కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమునా ప్రవీణ్ యాదవ్, సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు మోర్తాల రాజు,లడె రాజేశ్వర రావు,కాందారి సంతోష్,డుకిరే వినయ్,మండ రమేష్, బాధావత్ రమేష్,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


