వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు
కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
పట్టణంలోని 10, 17, 21, 23, 27 వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది మురికికాలువలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు చేపట్టారు.అదే సమయంలో పట్టణంలోని హోటళ్లు, భోజనశాలలను అధికారులు తనిఖీ చేసి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.మున్సిపల్ డంపింగ్ యార్డులోని డ్రై రిసోర్స్ కలెక్షన్ కేంద్రం, కంపోస్ట్ యార్డును కూడా పరిశీలించి వ్యర్థాల నిర్వహణ విధానంపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక నోడల్ అధికారి ఎస్. రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, సంబంధిత వార్డు కౌన్సిలర్లు, కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ ఎన్. సుధాకర్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ డి. కిరణ్, వార్డు అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.



