మరిపెడలో రైతులకు ఘోర అవమానం
యూరియా ఇమ్మంటే పాస్ బుక్‌లు బయటకు విసిరేశారు
వ్యవసాయశాఖ అధికారుల నిర్వాకం
కాకతీయ,నర్సింహులపేట(మరిపెడ) : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలకేంద్రంలో యూరియా కోసం క్యూలో వెళ్లిన రైతులకు ఘెర అవమానం జరిగింది. యూరియా కోసం వచ్చిన రైతులకు ఆధార్ మరియు పట్టా పాస్ బుక్ జిరాక్స్ లను ఇవ్వాలని అధికారులు సూచించడంతో రైతులు ఇచ్చారు. వచ్చినవాళ్లే వస్తున్నారు.. క్యూలో రావడం లేదంటూ అధికారులు జిరాక్స్ లను చిత్తు కాగితాలలాగా బయటపడేయడం గమనార్హం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది రైతులు తమ జిరాక్సు కాపీలను వెతుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అధికారుల ప్రవర్తన తీరు విస్మయానికి గురి చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


