epaper
Wednesday, March 11, 2026
epaper

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

మంత్రి పొన్నం ప్రభాకర్

ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి చర్యలు

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని డంపింగ్ యార్డును రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. డంపింగ్ యార్డు కారణంగా పట్టణ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.చొప్పదండి సభలో కరీంనగర్ డంపింగ్ యార్డును తరలిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డు తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.డంపింగ్ యార్డు వల్ల పరిసర ప్రాంత ప్రజలు శ్వాసకోశ సమస్యలు సహా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు.

 

దాదాపు 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను ఒక్కరోజులో తరలించడం సాధ్యం కాదని, అయితే ఏడాదిలోపు పూర్తిస్థాయిలో తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.కరీంనగర్ నుండి తరలించే డంపింగ్ యార్డును వరంగల్–కరీంనగర్ మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రెండు నగరాలకు ఇబ్బందులు లేకుండా వ్యర్థాల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రోజువారీగా వచ్చే చెత్తతో పాటు ఇప్పటికే పేరుకుపోయిన వ్యర్థాలను ఎలా తరలించాలన్నదానిపై ప్రత్యేక విధానం రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. చెత్త తరలింపుకు ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

 


ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన

కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పలు హోటళ్లను సందర్శించి ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.హోటళ్లలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకుండా స్టీల్ పాత్రలు వినియోగించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు గుడ్‌బై

బీఆర్ఎస్‌కు గుడ్‌బై బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా...

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం, గడ్డివానిపల్లి గ్రామంలో...

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌ కాకతీయ, కరీంనగర్ : సంచార,...

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన...

కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?

కాలువలో యువకుడి మృతదేహం...హత్యా? ప్రమాదమా? తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన కాకతీయ, కరీంనగర్ :...

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం? రూ.3500 టికెట్‌తో లక్షల బహుమతుల హామీ పోస్టర్లు,...

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు ఆరు రోజులుగా నీటి సరఫరా...

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img