విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
ఆలయానికి రూ. 51వేల విరాళం
కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: బలరాంనగర్ 184వ డివిజన్‌లోని నేరేడ్మెట్ పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనుక ప్రాంతంలో భక్తుల కోరిక మేరకు ఏర్పాటు చేసిన శ్రీరామలింగేశ్వరదేవి అమ్మవారి, పంచముఖి హనుమాన్ స్వామి, నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ముఖ్య అతిథిగా హేమంత్ పటేల్ పాల్గొని దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు.
దేవస్థానం అభివృద్ధి కోసం హేమంత్ పటేల్ రూ.51,000 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు ప్రవీణ్ యాదవ్, మురళి గౌడ్, శేఖర్ గౌడ్, దాచాబోయిన సాయినాథ్, శ్రీధర్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


