ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా
తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా
రేగళ్ల తండా సర్పంచ్ పూర్ణ
కాకతీయ ,కొత్తగూడెం: గ్రామ ప్రజల సౌలభ్యం కోసం, వారి సంక్షేమం కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిత్యం శ్రామికుడిగా పనిచేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వెనకాడ బోనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల పెద్ద తండాకు చెందిన లావుడియా పూర్ణ హామీ ఇచ్చారు. మంగళవారం పంచాయతీ ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా సౌకర్యాలు కల్పిస్తున్నానని ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నానని ఆయన తెలిపారు. ప్రధానంగా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారించారని వేసవికాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రుల సహకారాన్ని తీసుకుంటానని తెలిపారు. రేగళ్ల పెద్ద తండాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యవసరంగా పైప్ లైన్ నిర్మాణాన్ని చేపట్టానని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షే మం కోసం అనునిత్యం శ్రమిస్తున్నానని ప్రతి ఒక్కరూ తనకు సంపూర్ణ సహకారం అందిస్తే జిల్లాలోని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


