మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలోని టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టాక్సీ ఓనర్స్ డ్రైవర్ కి కారు పార్కింగ్ చేసుకోవడానికి హౌసింగ్ బోర్డ్ క్రాస్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మూడు పిల్లర్ల కింద స్థలం కావాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. అంతేకాకుండా అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి తగిన ప్రభుత్వ భూమి ఇవ్వాలని కోరారు. వెంటనే మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించి కార్ పార్కింగ్ స్థలాన్ని కేటాయించి, మూడు పిల్లర్ల కింద పార్కింగ్ ఏర్పాటు చేసుకోమని అన్నారు. కార్యాలయానికి సంబంధించి ప్రభుత్వ భూమిని చూసి స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు.


