ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం
-భవిష్యత్తులో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు
-వ్యవసాయ అధికారి కే.వెంకటేష్
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని మెట్‌పల్లి రైతు వేదికలో మంగళవారం రోజు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకం కింద ఎంపికైన రైతులకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా పచ్చి రొట్ట ఎరువులు, జీవన ఎరువులు వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమని, భూసారాన్ని కాపాడటంతో పాటు పంటల నాణ్యతను పెంచుతాయని తెలిపారు. భవిష్యత్తులో రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి గ్రామ సర్పంచ్ కుమారస్వామి, ఏఈలు తిరుపతి, కీర్తన, ఉప సర్పంచ్ సుభాష్ రెడ్డి, కృషి సఖి కవ్వ పద్మ,మొలంగూర్, మెట్‌పల్లి, లింగాపూర్ గ్రామాల పరిధిలోని రైతులు పాల్గొన్నారు.


