epaper
Tuesday, March 10, 2026
epaper

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కాకతీయ, కరీంనగర్ భగత్‌నగర్ : నా వెంట నిలబడి భారీ మెజారిటీతో గెలిపించిన 42వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని కరీంనగర్ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్‌నగర్ అయ్యప్ప దేవాలయంలో ఆదర్శ యువజన సంఘం, జైభీమ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు హరిహరక్షేత్రంలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆదర్శ యూత్ క్లబ్, జైభీమ్ యూత్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో నగరంలోని 66 డివిజన్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో అనే ఉత్కంఠ నెలకొనగా 42వ డివిజన్ ప్రజలు మాత్రం తన విజయం ఖాయమని నమ్మకంతో ఎదురుచూశారని గుర్తుచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఆశలు లేకుండా తన గెలుపు కోసం కృషి చేసిన ఆదర్శ యూత్ క్లబ్, జైభీమ్ యూత్ క్లబ్, చైతన్య యూత్ క్లబ్, భగత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత ఎన్నికల మాదిరిగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల్లా ప్రేమాభిమానాలు చూపుతూ తనను ముందుకు నడిపిస్తున్న ప్రజలు ఉండటం తన అదృష్టమన్నారు.డివిజన్ ప్రజలంతా ఏకతాటిపై ఉండి ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉండటం వల్లనే వరుస విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పనిచేశానని, ఇకముందు కూడా అదే విధంగా సేవలు అందిస్తానన్నారు. డివిజన్‌లో డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.భగత్‌నగర్ డివిజన్ నగరంలో ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర డివిజన్ల ప్రజలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. హిందూ, ముస్లిం ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకరి పండుగలను ఒకరు గౌరవించుకునే శాంతి వాతావరణం భగత్‌నగర్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడూ వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తనపై నమ్మకం ఉంచి నగరపాలక సంస్థకు అవసరమైన సూచనలు అందించాలనే ఉద్దేశంతో మళ్లీ డిప్యూటీ మేయర్ పదవి అప్పగించారని తెలిపారు. ఇందుకు భగత్‌నగర్ ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు డొంకిని జయరాం, సోడే ధనరాజ్, సోమిడి మల్లేశం, బాలు, జైభీమ్ యూత్ క్లబ్ సభ్యులు అరికిల్ల శంకర్, దాసరి రమేష్, అరుణ్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలోని...

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలెక్టరేట్...

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్ కాకతీయ, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి...

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం కాకతీయ, హుజురాబాద్: పట్టణంలోని జ్యోతిబాపూలే కూడలిలో సావిత్రిబాయి...

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం -భవిష్యత్తులో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక...

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు..

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూర్, నల్లా వెంకయ్యపల్లి...

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం కాకతీయ, కరీంనగర్: ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల...

కొలనూరుకు ఆర్ఓబీ మంజూరు

కొలనూరుకు ఆర్ఓబీ మంజూరు ఓదేలు కోసం కృషి కొనసాగుతుంది :ఎంపీ వంశీకృష్ణ ఆర్‌ఎఫ్‌సీఎల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img