డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..!
శుభ్రత పనులు చేపట్టిన కార్పొరేటర్లు
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్‌లో మేయర్ మూడు గణేష్ ఆధ్వర్యంలో డ్రైనేజీలను పరిశీలించి శుభ్రత పనులు చేపట్టారు. మంగళవారం డిప్యూటీ మేయర్ సరిపురపు లలిత కుమారి, 44, 40, 47 డివిజన్ల కార్పొరేటర్లు, సిపిఐ నాయకులతో కలిసి మేయర్ డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీ, గాంధీనగర్ ప్రాంతాల్లో డ్రైనేజీలు, మేడికుంట చెరువును పరిశీలించారు. డ్రైనేజీ కాలువలు దాటడం కష్టంగా ఉందని స్థానికులు తెలియజేయడంతో మేయర్ స్వయంగా పరిశీలించారు. వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరుతుందని ప్రజలు చెప్పడంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గొర్ల నరేష్, సిపిఐ రాష్ట్ర నాయకులు నరాటి ప్రసాద్, సిపిఐ జిల్లా నాయకులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, కొమ్మవరపు ఆదాము, అన్నవరపు వెంకటేశ్వర్లు, వీసంశెట్టి పద్మజ, కిన్నెర శ్రీను, ఆగ రెడ్డి వెంకట్ రెడ్డి, గూడపాటి నరసింహారావు, నారపోగు రామయ్య, వెంకన్న, కొత్తపల్లి శ్రీనివాసరావు, కేశపాక లక్ష్మి, జయరాజు, కటుకురి శేఖర్ బాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


