నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం
– సంగాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల అభినందనలు
– విద్యాభివృద్ధికి సహకరించాలని కౌన్సిలర్‌కు విజ్ఞప్తి
– పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న భవాని
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఎన్నికైన 11వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కొలిచేలిమి భవానిని మంగళవారం సంగాపూర్‌లోని ఎంపీపీఎస్ (మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల)లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, డి వేణు మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన కౌన్సిలర్‌గా భవాని వార్డు అభివృద్ధితో పాటు విద్యా రంగ అభివృద్ధికి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కౌన్సిలర్ భవాని మాట్లాడుతూ… విద్యాభివృద్ధి సమాజ అభ్యున్నతికి పునాది అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్తు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోలుచేలుమా స్వామి పాల్గొని కౌన్సిలర్ భవానిని అభినందించారు. ఉపాధ్యాయులు వి శ్రీనివాస్, కె భవాని, బి శ్వేత, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.


