కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు
కాకతీయ, కారేపల్లి: మండలంలో ప్రజా పాలన తొంభై తొమ్మిది రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంపీడీవో పొన్నూరు శ్రీనివాసరావు పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. సర్పంచ్ ఇస్లావత్ రాజుతో కలిసి గ్రామంలో చెత్తను తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. తొంభై తొమ్మిది రోజుల ప్రణాళికలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్, కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు భూక్య రవి, పండు, నాగేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


