epaper
Monday, March 9, 2026
epaper

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం
మరో నిందితుడు పరారీలో..
అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు

కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణంలో వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపారు. ఈనెల 2వ తేదీ రాత్రి గజ్వేల్ పట్టణంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌కు చెందిన పురంశెట్టి ప్రవీణ్ కుమార్ తన పల్సర్ బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేయగా, మరుసటి రోజు ఉదయం అది కనిపించకుండా పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 107/26 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలు, పాత నేరస్తుల రికార్డులను పరిశీలించిన పోలీసులు వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూరుగుపల్లి స్వామి, బూరుగుపల్లి మల్లేష్‌ను అనుమానితులుగా గుర్తించారు. సోమవారం ఉదయం పిడ్చేడ్ వైపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ సమీపానికి పల్సర్ బైక్‌పై వస్తుండగా వారిని పోలీసులు ఆపగా మల్లేష్ పరారయ్యాడు. స్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా పల్సర్ బైక్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన మరో 7 బైకుల వివరాలను వెల్లడించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పల్సర్, రెండు ప్యాషన్ ప్లస్ బైకులు ఉన్నాయి. అలాగే గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ప్యాషన్ ప్లస్, మెదక్ టౌన్ పరిధిలో ఒక ప్యాషన్ ప్లస్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీవీఎస్ ఎక్స్‌ఎల్, చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్యాషన్ ప్లస్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు మాట్లాడుతూ.. పాత మోటార్ సైకిళ్ల లాక్ సెట్లు అరిగిపోవడం వల్ల ఇతర తాళాలతో సులభంగా తెరుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దొంగతనాలకు తావు లేకుండా పాత వాహనాలకు కొత్త లాక్ సెట్లు వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన గజ్వేల్ ఎస్‌హెచ్‌ఓ వి. రవి కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్సైలు ప్రేమ్ దీప్ తదితర క్రైమ్ సిబ్బందిని ఏసీపీ నరసింహులు అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్...

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు కాకతీయ, గజ్వేల్ : మహిళలు తలుచుకుంటే అద్భుత...

సమస్యలు ప‌రిష్క‌రించండి

సమస్యలు ప‌రిష్క‌రించండి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: జీహెచ్‌ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఏకే మురుగేష్...

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి - సిఐటియు సిద్దిపేట జిల్లా...

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి * వార్డ్ కౌన్సిలర్ షరీఫా...

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..! హామీల అమలులో పూర్తిగా విఫలం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్...

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..!

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..! స్థానిక, వలస కూలీల మధ్య ఉద్రిక్తత కాకతీయ, గజ్వేల్...

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..!

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..! గిరి ప్రదక్షిణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కాకతీయ, గజ్వేల్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img